ప్రజా భాగస్వామ్యంతో నూతన మందిరం నిర్మాణం ఎంతైనా అవసరం
06-02-2025 21:42:26
ప్రజా భాగస్వామ్యంతో నూతన మందిరం నిర్మాణం ఎంతైనా అవసరం
హిరమండలం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 06:
మండలకేంద్రమైన హిర మండలం దేవరశెట్టి వీధిలోని శ్రీ సత్యసాయి మందిరాన్ని గురువారం శ్రీ సత్యసాయి సేవా సంస్థ ల రాష్ట్ర అధ్యక్షులు రఘు పాత్రుని లక్షమ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సహకారం తో నూతన మందిరం నిర్మాణం సాధ్యమని,మందిరం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున కొత్త మందిరం నిర్మాణం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకల నాటికి పూర్తి చేయనున్నామని, ప్రజల భాగస్వామ్యముతో నిర్మించనున్నామని, క్యారేజ్ లు ద్వారా హిరమండలం పరిసర ప్రాంతాల్లో ఉన్న దీనుల కు ఆహారాన్ని అందజేయనున్నామని, వృద్ధులకు ఫిజియోథెరపీ సెంటర్, ఉచిత ఆరోగ్య సేవలు, నిరుద్యోగ యువతకు వ్యక్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ సమన్వయకర్త బి నరసింహమూర్తి, హిరమండలం శ్రీ సత్యసాయి సేవా సంఘం అధ్యక్షులు ఎ అబ్బాయి, గౌరవ అధ్యక్షులు అంద వరం వెంకట్ సురేష్, సాంకేతిక సలహాదారులు ఎస్ సాయిబాబా, సెక్రెటరీ అంద వరం బుచ్చబ్బాయి, జోనల్ కన్వీనర్ చంటి మాస్టారు భక్తులు పాల్గొన్నారు.