కొబ్బరి రైతులకు అవగాహన సదస్సు
కంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 6:
కంచిలి మండలం జాడుపూడి మరియు కాకర్లపుట్టుగ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొబ్బరి రైతుల అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉద్యాన అధికారి మాధవి లత పాల్గొన్నారు. రైతులను ఉద్దేశించి ఉద్యాన శాఖకు సంబంధించి వివిధ పథకాల గురించి వివరించడం జరిగింది. కొబ్బరి కి సంబంధించి బీమా కోసం వివరిస్తూ
కొబ్బరి భీమాకు సంబంధించి రైతులు తమ యొక్క తోటలో ఉన్నటువంటి 4 నుంచి 15 సంవత్సరాలు మరియు 16 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ఆరోగ్యకరమైనటువంటి కొబ్బరి చెట్లకు 1/2/3 సంవత్సరమునకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చని వివరించడం జరిగింది. రైతుల నుంచి కావలసిన డాక్యుమెంట్లు పత్రాలు డిడి వంటి వివరాలు ఒక్కొక్క చెట్టుకు వయసును బట్టి చెల్లించవలసిన ప్రీమియం మరియు ఇన్సూరెన్స్ వివరాలు వివరించడం జరిగింది. ఉద్యాన శాఖ మరియు ఏపీఎంఐపి పథకాల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాడు పూడి,కాకర్లపుట్టుగా గ్రామస్తులు రైతులు ,ఉద్యాన శాఖ అధికారి మాధవి లత , ఉద్యాన విస్తరణ అధికారి బాలరాజు,ఎంపీ ఈఓ లలిత, గ్రామ ఉద్యన సహాయకులు శాంతమ్మ, గ్రామ వ్యవసాయ సహాయకులు ఐశ్వర్య రైతులు,పాల్గొనడం జరిగింది.