Sidebar


Welcome to Vizag Express
తండేల్ " ను ఆదరిద్దాం!

06-02-2025 21:48:16

 తండేల్ " ను ఆదరిద్దాం!
 మత్స్యకారుల బతుకులు తెలుసుకుందాం!
 మత్స్యకార నాయకులు పిలుపు !

 మత్స్యకారుల ఇతివృత్తంతో నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా  నటించిన తండేల్  సినిమా శుక్రవారం విడుదల అవుతుంది.ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని మత్స్యకార సామాజిక సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు లండ రుద్రమూర్తి ,భిలాయ్ ఎస్టీ సాధన సమితి గౌరవాధ్యక్షులు మొరుపల్లి బాబూరావు ,తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదిక ప్రతినిధి సూరాడ చంద్ర మోహన్ లు  పిలుపునిచ్చారు .ఈ మేరకు గురువారం సోంపేట మండలం ఎర్రముక్కాం చంద్ర మోహన్ స్వగృహంలో మాట్లాడారు.ఈ చిత్రం ఫ్రీ  ఈవెంట్స్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కౄ మత్స్య లేసం   గ్రామానికి చెందిన మత్స్యకారలను ఆహ్వానించడం ఆనందంగా ఉందని అన్నారు. సముద్రంలో వేట సంధర్భంగా అనుకోకుండా పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు చిక్కి అక్కడ జైళ్లలో మత్స్యకారులు అనుభవించిన బాధలను కళ్లకు కట్టినట్లు చూపించారని , అలాగే సక్సెస్ మీట్ కూడా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు హీరో నాగార్జున భరోసా ఇవ్వడం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కొత్త ఒరవడికి నాంది పలికారని అన్నారు. జిల్లాలో సుమారు 20 థియేటర్లు లో శుక్రవారం సినిమా విడుదల అవుతుందని మత్స్యకారులు అందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని వారు విజ్ఞప్తి చేసారు. అలాగే అన్ని సామాజిక వర్గాలకు కార్ఫోరేషన్లు ఉన్నాట్లే వాడబలిజ సామాజిక వర్గానికి కూడా ప్రత్యేక కార్ఫోరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ,డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ లను ఈ సందర్భంగా కోరారు