Sidebar


Welcome to Vizag Express
ఎట్టకేలకు కిడ్నీ ఆసుపత్రి సిబ్బందికి జీతాలు

06-02-2025 21:49:47

ఎట్టకేలకు కిడ్నీ ఆసుపత్రి సిబ్బందికి జీతాలు

ఎమ్మెల్యేకు అభినందిచిన 
సిబ్బంది ..

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ పిబ్రవరి 6:

కాశీబుగ్గ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి   కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్  సిబ్బంది కి గత  కొన్ని నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న సిబ్బందికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా చొరవతో ఎట్టకేలకు గురువారం వారి ఖాతాల్లో కి జీతాలు చేరాయి. ఇందులో పనిచేస్తున్న యాభై మంది సిబ్బంది కి జీతాలు అందడంతో ఆనందం వ్యక్తం చేసారు.  ఎమ్మెల్యే గౌతు శిరిష కు మిఠాయిలు తినిపించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు