Sidebar


Welcome to Vizag Express
రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు దుర్మరణం.

06-02-2025 21:51:08

ఎచ్చెర్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 6. రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు దుర్మరణం.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని చౌదరి సత్యనారాయణ కాలనీకి చెందిన తరుణ్ (19), పాజిల్ బేగ్ పేటకు చెందిన కార్తీక్ (21) బైక్ పై వస్తూ డివైడర్ ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.