Sidebar


Welcome to Vizag Express
వైకాపా హయాంలో అక్రమాలు !

06-02-2025 21:52:36

వైకాపా హయాంలో అక్రమాలు !

బహిర్గతం చేసిన టీడీపీ శ్రేణులు


సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,పిబ్రవరి 6:


మందస మండలం హరిపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  పార్టీ మండల అధ్యక్షులు భావన దుర్యోధన అధ్యక్షతన గురువారం సాయంత్రం పత్రికా సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో మండల నాయకులు ,జిల్లా అధికార ప్రతినిధి దాసరి తాతారావు, మండల నాయకులు పాల్గొన్నారు
 ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భావన దుర్యోధన , జిల్లా అధికార ప్రతినిధి తాతారావు లు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బాహాడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి అయినటువంటి బొడ్డు ఉదయ్ కుమార్ ఎటువంటి పర్యావరణ అనుమతులు గాని భూగర్భ మరియు ఖనిజ శాఖల అనుమతులు లేకుండా పచ్చని చెట్లతో ఉన్న నల్లబడ్లూరు కొండ సుమారు తొమ్మిది ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఆ కొండను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా ఆ ప్రక్కనే ఉన్న ఉద్దాన ప్రాజెక్ట్ మంచినీటి ట్యాంకుకు ముప్పు వాటిల్లేలా పూర్తిగా కొండను త్రవ్వి కంకర,రాయిని లక్షల రూపాయలకు అమ్ముకొని అప్పుడున్న అధికార వైసిపి పార్టీ నాయకులు సొమ్ము చేసుకున్నారు.గత ఐదేళ్లు పలాస నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శ్రీమతి శిరీష గారు పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ గ్రామ ప్రజలు రైతులు మరల ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి సదరు బొడ్డు ఉదయ్ కుమార్ కు 3,65,34,792/- రూపాయల జరీమానా మైన్స్ అధికారులు విధించారని  విలేకరుల సమావేశంలో తెలిపారు.మాజీ మంత్రి అప్పలరాజు   పేటిఎమ్ బ్యాచ్ గత ఐదేళ్లు తప్పుడు పోస్టులు పెట్టిన సంగతి అందరికీ తెలుసేనని. మాజీ గారు తన ఓటమి ని  జీర్ణించుకోలేక మళ్ళీ తన పేటీఎం బ్యాచ్ తో తప్పుడు పోస్టులు పెట్టిస్తూ వికృతి చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఈ మధ్యకాలంలో పలాసలో ఇరుగుపొరుగు రెండు కుటుంబాల మధ్య జరిగిన తగాధను మా పార్టీకి ఆపాదించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తప్పుడు పోస్టులు పెట్టిన వారికి హెచ్చరిస్తున్నాము మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో లబ్బ రుద్రయ్య,రట్టి లింగారాజు,తమిరి భాస్కరరావు,బమ్మిడి కర్రయ్య,ముడుమంచి నవీన్ కుమార్, సిర్ల కృష్ణారావు,సాలిన మాధవరావు,మామిడి తాతారావు,మండల లచ్చయ్య, సాలీనా జానకి రావు,బొంగు దామోదర్,కరగాన వాసు,బొడ్డు జగన్నాథము,కొట్రా వైకుంఠ రావు, సాలీనా ఉమాపతి,సవర శంకర్రావు, బొడ్డు వాసు,అందాల గిరి,వేణు,దేబాసిస్ పండా,మురళి,బొడ్డు కాములమ్మ పొందర దుదిష్టి బీజేపీ నాయకులు,బర్ల కృష్ణారావు,సోపిటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు*...