Sidebar


Welcome to Vizag Express
అవార్డు గ్రహీతకు సన్మానం

06-02-2025 21:53:52

అవార్డు గ్రహీతకు సన్మానం 

ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6

 పట్టణానికి చెందిన రంగాల జానకిరామిరెడ్డి కళా రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక నంది అవార్డుకు ఎంపిక పట్ల జిల్లా కెమిస్టుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గురువారం అవార్డు గ్రహీత కు సంఘం సభ్యులు కన్యకా పరమేశ్వరాలయంలో సాలువాలతో సత్కరించారు. భవిష్యత్తులో కూడా ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ వర్తక సంఘం అధ్యక్షులు కిల్లం శెట్టి కిరణ్ కుమార్ గుప్తా, కార్యదర్శి వైశ్యరాజు మని రాజు, వి శివాజీ, నరేంద్ర పి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు