06-02-2025 21:58:48
మహిళా సంఘ పుస్తకాలను పరిశీలించిన. ఏ పి ఎం. మందస, ఎక్స్ ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 6: మందస. మండల పరిధిలోగల అన్ని గ్రామాల్లో కూడా మహిళా సంఘాల పనితీరును ,పుస్తక నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వెలుగు ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. గురువారం బాలిగాం పంచాయతీలో గల రంగనాథపురం గ్రామంలో స్వయం శక్తి సంఘాల పనితీరును పరిశీలిస్తూ, అక్కడ రెండు స్వయం శక్తి సంఘాల పనితీరును పొదుపు అప్పుల నిర్వహణను పరిశీలించారు. సభ్యుల పొదుపు రెండు లక్షలే ఉన్నప్పటికీ ,సంఘం కార్పస్ సంగ్రహ పట్టికలో నాలుగు లక్షల పైబడి ఉన్నందుకు ఆ సంఘాలను ప్రశంసించారు. అన్ని గ్రామాల్లో కూడా సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వారు దాసుకున్న పొదుపు డబ్బులును ఇంటర్నల్ లెండింగ్ ద్వారా సభ్యుల అవసరమేరకు ఎంత అప్పులు ఇచ్చుకున్నారు? అవి వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నారా? లేదా? పుస్తకాల్లో సరిగా నమోదు అవుతుందా? లేదా? సంబంధిత బుక్ పేపర్లు వి.వో.ఏ.లు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నారు అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. సంబంధిత క్లస్టర్ కోఆర్డినేటర్ల పర్యవేక్షణ ఎలా ఉంది? అని అన్ని కోణాల్లో పరిశీలిస్తూ, కమ్యూనిటీ ఆడిటర్లతో ప్రతి సంఘాన్ని తప్పనిసరిగా ఆడిట్ చేయించి వారి లెక్కలను వివరంగా పుస్తకాల్లో నమోదు చేసుకొని సభ్యులకు వివరించాలని సూచించారు. సంఘం తీసుకున్న రుణాలను ఏ విదమైన ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు అన్న విషయాన్ని పరిశీలిస్తూ, ఏ విధమైన ఆదాయ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టని సభ్యులకు ఎక్కువ మొత్తంలో రుణాలను ప్రోత్సహించవద్దని సంబంధిత సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.వో.ఏ. మోహినితోపాటు, క్లస్టర్ కోఆర్డినేటర్ మీనాక్షి, డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41