Sidebar


Welcome to Vizag Express
జిల్లా ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా 'సంకల్పం' అనే కార్యక్రమం నిర్వహించారు

07-02-2025 22:04:53

చీపురుపల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 6: జిల్లా ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు  చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో  మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా  'సంకల్పం' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎల్ .దామోదర్ రావు పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరాలు పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ చట్టాల పట్ల అవగాహన కలిగి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఏ ఒక్కరూ పాల్గొనకూడదన్నారు. మాధ క ద్రవ్యాలు సేవించిన, అమ్మిన, సరఫరా,చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అన్నారు. రహదారి భద్రతలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ట్రిపుల్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం,  వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల కారణంగా ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వివరించారు. మహిళల రక్షణ పట్ల ప్రతి ఒక్క విద్యార్థిని అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరిచిత అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.మాదకద్రవ్యాలు ,సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా లఘు చిత్రాలను ప్రదర్శించి వాటి వలన కలిగే దుష్పరిణామానాలను గురించి వివరించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఎ.డి.ఎన్.ఎస్.వి.ప్రసాద్  మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ,ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేసి నేరాలు అరికట్టడంలో ముఖ్యపాత్ర వహించాలని కోరారు .ఈ సందర్భంగా సంకల్పం అనే కరపత్రాన్ని విడుదల చేశారు .
ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్, పి.ఓ.లు  ,స్టేషన్ సిబ్బంది, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.