Sidebar


Welcome to Vizag Express
గుండెను రక్షించుకోవాలి.

07-02-2025 22:06:32

గుండెను రక్షించుకోవాలి.     
                                         
 కె.కోటపాడు,వైజాగ్ ఎక్స్ ప్రెస్  , ఫిబ్రవరి07:  మారుతున్న ఆహారపు అలవాట్లు తగిన వ్యాయామం లేకపోవడంతో చిన్నతనం నుండే గుండెపోటు కు గురవుతున్నారని  'గుండెకు భరోసా'  అనే కార్యక్రమం పై గ్రామాల్లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని   స్థానిక 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టరు శ్రీ లక్ష్మి అన్నారు. గుండెకు భరోసా ఇచ్చే "స్టెమి"అనే హృద్రోగ నిర్ధారణ, వైద్య చికిత్స ప్రక్రియపై ప్రజలకు విస్తృత అవగాహనా కల్పించేందుకు శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించి కర పత్రాలను డాక్టర్లు అవిష్కరించారు.ఈ సందర్బంగా డాక్టరు శ్రీ లక్ష్మి మాట్లాడుతూ ఎవరికయినా గుండెపోటు వస్తే వారికీ మొదటి గంట అత్యంత కీలకమయిందని వెంటనే చర్య తీసుకొని ప్రాణాలను కాపాడు కోవాలని, దీనిగురించి అందరికీ అవగాహనా ఉండాలన్నారు. ఛాతి నొప్పి రావడంతోపాటు ఎడమ భుజం లాగడం, ఆకస్మిక ఆయాసం, గుండె దడ, స్పృహ కోల్పోవడం గుండెపోటు లక్షణాలు కావచ్చని చెప్పారు. గుండె పోటు లక్షణాలను గుర్తించిన మొదటి గంటలోపు 108కి ఫోన్ చేస్తే దగ్గరలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రికి తీసుకొని వెళ్తారని తెలిపారు. ప్రాధమిక పరీక్షలు చేసి తొలి గంటలోనే రూ. 45,000ల విలువయిన "టెనెక్టేప్లెస్" ఇంజక్షన్ ను ఉచితంగా ఇచ్చి ప్రాణాలను కాపాడతారని తెలిపారు. . డాక్టరు కోటేశ్వరరావు మాట్లాడుతూ గుండె పోటు రావడానికి కారణాలు వివరించారు. గుండె పోటుకు అన్ని సర్వ జన ఆసుపత్రుల్లో, "ఎన్ టి. అర్. వైద్య సేవ" ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో "అంజియో ప్లాస్టీ", అండ్ బైపాస్" సర్జరీ చికిత్సలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ గుండె పోటు చికిత్సకు సంబంధించి నెట్ వర్క్ ద్వార