స్క్రీనింగ్ తో క్యాన్సర్ పై విజయం సాధ్యం
-మహిళలకు, విద్యార్థులకు క్యాన్సర్ పై అవగాహన
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7:
ముందస్తు పరీక్ష-కాన్సర్ నుంచి రక్ష అనే నినాదంతో యలమంచిలి మున్సిపాలిటిలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజిని ఆదేశాల మేరకు శుక్రవారం యలమంచిలి పట్టణంలో యాతపేట,తులసీనగర్,సతకం పట్టు ప్రాంతాలలో డ్వాక్రా మహిళలకు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆయా సచివాలయాల పరిధిలో గల ఏ ఎన్ ఎమ్ లు,మెప్మా ఆర్పీలు క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలతో వారు మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్, సర్వైవల్ క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదే విధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనారోగాలకు దూరంగా ఉండచ్చని తెలిపారు.క్యాన్సర్ పై అనుమానితులు ఎవరైనా తమని సంప్రదిస్తే ముందుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించి అప్రమత్తం చేయించగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాతపేట, తులసీనగర్,సతకం పట్టు ఏ ఎన్ ఎమ్ లు,ఆర్పీలు నాగమణి,సత్యవతి, జగన్మోహిని,లక్ష్మీ,అరుణ, పుష్ప,నర్మద ,డ్వాక్రా మహిళలు,విద్యార్థులు పాల్గొన్నారు