Sidebar


Welcome to Vizag Express
స్త్రీలపై దాడులు నియంత్రించాలని ఎస్ ఎఫ్ ఐ నిరసన

07-02-2025 22:09:12

స్త్రీలపై దాడులు నియంత్రించాలని ఎస్ ఎఫ్ ఐ నిరసన
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7:
అనకాపల్లి జిల్లా  బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న  విద్యార్థినిపై  ఆ పాఠశాల ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడడం దుర్మార్గపు చర్య అని, స్త్రీలపై జరుగుచున్న లైంగిక దాడులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం యలమంచిలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎల్ ఐ సి బిల్డింగ్ వరకు విద్యార్థినిలతో ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.అభిషేక్, జల్ల శ్రీనులు మాట్లాడుతూ నిత్యం అమ్మాయిలపై లైంగిక దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని వీటికి ప్రధానమైన కారణం సినిమాలలో పాటూ మద్యం కూడా కనుక  వీటిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అరికట్టాలని,ఈ మధ్యకాలంలో తీస్తున్న  సినిమాలు  అశ్లీలతను, హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని,అటువంటి సినిమాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమాజంలోకి రానివ్వకుండా అరికట్టాలంటూ విద్యార్ధినిని లైంగిక వేధింపులు గురిచేసిన ఉపాధ్యాయుడిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కృపానంద్ ,డివిజన్ నాయకులు రాజేష్ ,సింహాద్రి , మాజీ నాయకులు  పాల్గొన్నారు.