వైసిపి పార్టీ కు జగన్మోహన్ రెడ్డి కు రుణపడి ఉంటా
07-02-2025 22:10:34
వైసిపి పార్టీ కు జగన్మోహన్ రెడ్డి కు రుణపడి ఉంటా
పార్టీ బలోపేతానికి కృషి
మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,07: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర పార్టీ కార్యాలయం అల్లూరి జిల్లా అరకు నియోజక వర్గం ముంచంగిపుట్టు మండలం వైసిపి పార్టీ అధ్యక్షులుగా పాంగి పద్మారావు ను గురువారం నియమించింది. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు సూచనలు సలహాలు పాటిస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి సహాయ సక్తుల కృషి చేస్తానన్నారు. 23 పంచాయతీ పరిధిలో గల సర్పంచులు,ఎంపీటీసీలు, పార్టీ నాయకులతో సమన్వయం పాటిస్తూ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రెండోసారి మండల పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. అలాగే అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షులు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు ఎంపీ, డాక్టర్ గుమ్మ తనుజ రాణి, అరకు ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్, సుభద్ర, శాసన మండలి సభ్యులు, డాక్టర్ కుంభ రవిబాబు, అలాగే పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలకు సర్పంచులకు ఎంపిటిసి లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.