Sidebar


Welcome to Vizag Express
మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన

07-02-2025 22:12:10

మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన 

వైసిపి మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,07: మండలంలో జర్జుల  పంచాయితీ పరిధి గుంజిరి సంత జంక్షన్ లో వెలసిన శ్రీశ్రీశ్రీ శివలింగేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభించి నేటికీ 20 వసంతాలు పూర్తి అయిన శుభ సందర్భంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ను వైసిపి పార్టీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈనెల 26వ తేదీన  మహాశివరాత్రి మహోత్సవం 20 వసంత వాళ్ళు పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి గిరిజన యువతులను దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ టోర్నమెంట్ కు మండలంలో గల క్రీడా నైపుణ్యం గల క్రీడాకారులు వారి పేర్లను నమోదు చేసుకుని టోర్నమెంట్లో పాల్గొనవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పీసా కమిటీ ఉపాధ్యక్షులు, బి రామారావు, ఆలయ కమిటీ, అధ్యక్ష కార్యదర్శులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.