టీడీపీ సీనియర్ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు
07-02-2025 22:13:20
టీడీపీ సీనియర్ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు
కుటుంబానికి కూటమి ప్రభుత్వం నేతలు పరామర్శ
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి,07: తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆంత్రు మరణం పార్టీకి తీరని లోటనిటిడిపి క్లస్టర్ యూనిట్ ఇన్చార్జి మజ్జి చిన్ని బాబు పైసా కమిటీ పంచాయతీ అధ్యక్షులు బి రామారావు లు అన్నాను. మండలంలో జర్జుల పంచాయితీ చిన్నతమింగుల గ్రామంలో శుక్రవారం కూటమి పార్టీ నేతలు గ్రామాన్ని సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండల దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొంతేరి జగత్రాయి ఆదేశాల మేరకు తమ్మెంగుల గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త పాంగి అంత్రు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే దీంతో మూడు రోజుల సంస్మరణ దినం సందర్బంగా కుటుంబానికి బియ్యం బస్తా ఆర్థిక సాయం అందించమన్నారు. పాంగి అంత్రు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ సమస్య ఉన్న మండల కూటమి నాయకుల దృష్టికి తీసుకు రావాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జి కిల్లో సూర్యనారాయణ కూటమి నాయకులు కిల్లో అర్జున్, పాంగి బుద్దు, పాంగి సద్దు పాంగి మొన్నో, కిల్లో కృష్ణ, కొర్ర బుద్దు, కొర్ర కృపా సింధు కొర్ర మంగు కూటమి నాయకులు,అభిమానూలు, పాల్గొన్నారు.