07-02-2025 22:20:18
ఘాటి ముకుందపురం రోడ్డుకు మోక్షంకంచిలి వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 7: అంపురం జంక్షన్ నుండి ఘాటి ముకిందపురం వరకు గల రహదారి విస్తరణ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ప్రకటన రావడంతో మండలంలో గల అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తపరుషున్నారు. ఎన్నో దశాబ్దాలు నుడి సమస్యగా ఉన్న ఈ రహదారిని తెలుగుదేశం ప్రభుత్వం తోనే పరిష్కారం జరగడం వల్ల ఆయా పార్టీ నాయకులుకు మండలంలో ఒక మంచి పని జరిగినట్లు చెప్పవచ్చు. అంపురం కూడలి నుంచి ఎంఎస్ పల్లి మీదుగా రేఖదేవపురం డిజిపురం బైరిపురం నుండి ఘాటి ముకుందపురం వరకు 11 కిలోమీటర్ల రహదారికి కేంద్ర ప్రభుత్వం నుండి 23 కోట్ల రూపాయలు నిధులతో రహదారి విస్తరణకు కేంద్ర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు ప్రతిపాదనలు తీసుకురాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందడంతో కేంద్ర జాతీయ రహదారుల రవాణా శాఖ నుండి సి ఆర్ పి ఎఫ్ 11 లో భాగంగా 23 కోట్ల రూపాయలు తో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు తీసుకురావడానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన కృషి ఎంతగానో ఉందని ఈ నిధులు సాధించుకోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు కృషి పట్టుదల ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దశాబ్దాల కాలంగా ఈ రహదారి విస్తరణకు నోచుకుపోగా కనీసం పూర్తిస్థాయి మరమ్మత్తులు చేపట్టకుండా గత ప్రభుత్వాలు కాలయాపన చేయడం తప్ప ఒక పని కూడా జరగలేదని చెప్పవచ్చు. తరచూ ఈ రహదారిలో ప్రమాదాలు జరుగుతూ ఉండటం చూస్తే రహదారిలో ఉన్న మలుపులు అయితేనేమి గోతులతో ప్రయాణం చేయాలంటే ప్రమాదకరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రహదారి విస్తరణ పనులకు అటు కేంద్రమంత్రి ఇటు విప్పు అశోక్ చేసిన కృషికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిని రామారావు,బుడ్డపు కామేష్, వాసాల రమేష్ రెడ్డి, తమరాల వెంకటరమణ, మధ్యలో ఆనంద్ కేశవరావు తదితర నాయకులు కృతజ్ఞతలు తెలిపారు
12-02-2025 16:06:56
12-02-2025 16:05:24
12-02-2025 16:04:58
12-02-2025 16:04:41
12-02-2025 16:04:09
12-02-2025 16:02:22
12-02-2025 16:01:32
12-02-2025 16:00:10
12-02-2025 15:59:19
12-02-2025 15:59:16
12-02-2025 15:58:47
12-02-2025 15:58:22
12-02-2025 15:46:48
12-02-2025 15:45:41