తండేల్ సినిమా చాలా బాగుంది!
అనూహ్య ఆదరణ!
నాగచైతన్య ,సాయి పల్లవిల నటనకు నీరాజనాలు!
సినిమా సూపర్ హిట్ అంటున్న మత్యకారులు!
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ప్రెస్ ,పిబ్రవరి 7:
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో తెరకెక్కించిన తండేల్ సినిమా కు తొలి రోజు శుక్రవారం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇది మన జీవితాలకు సంబంధించిన సినిమా అంటూ మత్యకారులు థియేటర్లో ఆనందంతో సందడి చేశారు. సోంపేట ఎస్ఎస్ మాక్స్ థియేటర్లో ప్రదర్శించిన ఈ సినిమాకు ఇచ్చాపురం ,సోంపేట కవిటి , కంచిలి, మండలాల పరిధిలోని మత్స్యకారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తండేల్ రాజుగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య,మత్స్యకార మహిళగా సాయి పల్లవిల నటనకు థియేటర్ చప్పట్లుతో మారుమ్రోగింది. ఆద్యంతం హీరో హీరోయిన్లు నటనకు అద్భుతంగా ఉందని, ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన మత్స్యకారుల యాషభాసలతో హీరో హీరోయిన్లు విశేషంగా ఆకట్టుకున్నారని ఈ సందర్భంగా ప్రేక్షకులు తెలిపారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్, బన్నీ వాసు చందు మొండేటి ఇతర సాంకేతిక వర్గానికి ప్రేక్షకులు అభినందనలు తెలిపారు. కళ్ళ కట్టినట్టుగా చిత్రాన్ని నిర్మించారని మత్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మండలం డి మత్సలేసం , బడివానిపేట, కళింగపట్నం, వంశధార ,నాగావళి, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో కనిపించిన దృశ్యాలను ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయని మత్స్యకారులు పేర్కొన్నారు