Sidebar


Welcome to Vizag Express
జగన్నాధపురం లో దుర్గమ్మ గుడి ప్రారంభోత్సవం

07-02-2025 22:28:55

జగన్నాధపురం లో దుర్గమ్మ గుడి ప్రారంభోత్సవం
 
 ఆనందపురం, వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్, ఫిబ్రవరి 7.

ఆనందపురం మండలం జగన్నాధపురం  గ్రామంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ దుర్గమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవం చేశారు. ఉదయం 6 నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, మహిళలు కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఉత్సాహంగా గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3,000 మందికి భారీ అన్న సామ్రాధన కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల నుండి భక్తులందరూ అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బంక సత్యం,సర్పంచ్ బంక శ్రీను, మాజీ సర్పంచ్ పాండ్రంగి అప్పలరాజు, మతికాన ఆదినారాయణ, జట్ల నాయుడు, రెల్లి గురు నాయుడు, పూజారి పాండ్రంగి రమణ, పైడిరాజు,కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు