Sidebar


Welcome to Vizag Express
గత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ ను రద్దు చేయాలి

07-02-2025 22:33:48

గత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ ను రద్దు చేయాలి                      గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 8                  జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్  గాజువాక జోన్ కార్మికులను ఉద్దేశించి కార్యదర్శి  గొలగాని అప్పారావు మాట్లాడుతూ,  ఆప్కాస్‌ రద్దు  చేస్తే కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలి.
పొరుగు సేవలు కార్మికుల కోసం గత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్‌ ను రద్దు చెయ్యాలని గురువారం జరిగిన మంత్రివర్గం తీర్మానించి నట్లు పత్రికల్లో వచ్చింది. ఈ ప్రకటనతో  ఆప్కాస్‌ లో ఉన్న  పొరుగు సేవల కార్మికులందరి లోనూ  తీవ్ర భయాందోళన నెలకొన్నది. అని అన్నారు. ఆప్కాస్‌ ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుంది. ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది  పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి ఉద్యోగ భద్రత,  భరోసా కల్పించే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్‌ ఏర్పాటు  కాకముందు మున్సిపాలిటీ రంగంలో ప్రతి సెక్షన్‌ కి  దళారీ వ్యవస్థ కొనసాగేది. జీతభత్యాల చెల్లింపు దళారీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది. ప్రతి నెల జీతాలు చెల్లించేవారు కాదు. ఐదు నుండి ఆరు నెలలు జీతాలు బకాయిలు పెట్టేవారు. జీతాలలో కూడా పెద్ద ఎత్తున కోతలు విధించి కార్మికులను దగా చేసేవారు. కార్మికుల బ్యాంకు పాస్‌ పుస్తకాలు కూడా వారి దగ్గరే పెట్టుకుని కార్మికులను వేధించేవారు. ఆప్కాస్ వ్యవస్థ ఏర్పాటు వల్ల వీటన్నిటికీ చెల్లు చీటీ జరిగింది. గత వైసిపి ప్రభుత్వం దళారీ వ్యవస్థను రద్దుచేసి ఉద్యోగాలు పర్మనెంట్‌  చేస్తామన్న హామీని కార్మికులందరూ నమ్మారు కానీ వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలు  పర్మనెంట్ చెయ్యలేదు. దళారీ వ్యవస్థ స్థానంలో ప్రభుత్వమే మధ్యవర్తి పాత్ర పోషించే ఆప్కాస్‌ వ్యవస్థను తెచ్చిపెట్టింది. 
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కాస్‌ ను  రద్దుచేసి ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తుందని కార్మికులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ గురువారం జరిగిన మంత్రివర్గం సమావేశం అందుకు భరోసా ఇవ్వకపోగా ఆప్కాస్ ను  రద్దుచేసి తిరిగి దళారీ వ్యవస్థను తెచ్చిపెడుతుందనే ప్రచారం జరగటం తీవ్ర విచారకరం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం,  శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్‌  సెక్షన్ విభాగాలకు చెందిన ఒప్పంద కార్మికులను పర్మినెంట్‌  చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉద్యోగాలు పర్మినెంట్‌ చేసే దిశగా కాకుండా దళారీ వ్యవస్థను తెచ్చిపెట్టే టట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటం తప్పదు మరి అని రాష్ట్ర కమిటీ పిలుపు అని అన్నారు.