అబద్దాలు, అసత్యాలే జగన్ అజెండా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు ధ్వజం
గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్,ఫిబ్రవరి 8
శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని జగన్ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. జగన్ హయాంలో ఏనాడూ ప్రజాస్వామ్యబద్దంగా పాలన నడిపించలేదని అధికారం కొల్పొయేసరికి విశ్వసనీయత, నీతి, నిజాయితీ అనే కొత్త మాటలు వస్తున్నాయన్నారు. ప్రజాతీర్పును అపహస్యం వేసే విధంగా అసెంబ్లీకి రాను.. మీడియా వేదికగా ప్రజాగొంతుకను వినిపిస్తానని అంటున్నారని నిజమైన ప్రజానాయకుడు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని అన్నారు. ప్రజా తీర్పును జగన్ రెడ్డికి గౌరవించటం రాదని 2019లో టీడీపీకి 23 సీట్లే వచ్చినా ప్రజా తీర్పును గౌరవించి చంద్రబాబు అసెంబ్లీలో నడుచుకున్న తీరు గమనించాలన్నారు.
ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చినా ఆ తీర్పును గౌరవించే విధంగా నడుచుకోవాలి. అసెంబ్లీకి వెళ్లి ప్రజాగొంతుకను వినిపించాలి.. అలా కాదు, నాకు తక్కువ సీట్లు వచ్చాయి.. నేను అసెంబ్లీకి వెళ్లను.. మీడియా ముఖంగానే మాట్లాడుతాను అంటే ప్రజాతీర్పును అగౌరవపరడమేనన్నారు. దారుణాలకు, దాడులకు, దోపిడిలకు జగన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. బాబాయ్‌ని హత్య చేసి చంద్రబాబుపై నెట్టిన తీరు.. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసిన తీరు.. మద్యం, ఇసుక, మైనింగ్ లో దోపిడీలు చేసిన తీరు ఇందుకు నిదర్శనమన్నారు.
2019-2024 వరకు నాసిరక మద్యం విక్రయించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నారని, ఈనాటికి కూడా 3,00,000 మంది ఆ మద్యం తాగిన వాళ్ళు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 35 వేల మంది మృతి చెందారన్నారు. పేరుకు మాత్రం 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను అగౌరవపరిచే విధంగా సరైన కార్యాలయం గాని, కుర్చీలు గానీ ఇవ్వకుండా అవమానించారన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్‌ను 24 శాతానికి కుదించి 16 వేల మందిని పదవులకు దూరం చేశారని మండిపడ్డారు. ఇప్పుడేమో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గొంతు చించుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. సూపర్ సిక్స్ అమలు కాలేదని జగన్ రెడ్డి అంటున్నాడు .. అమలు కాకుండానే అన్న క్యాంటీన్లు ప్రారంభించారా..? అమలు కాకుండానే పింఛన్ ను పెంచి వాలంటీర్లు లేకుండా ఇంటింటికి పంపిణీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల హామీల్లో పింఛన్ ను రూ.3000 చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి రూ.250లు పెంచుకుంటూ పోతామని ప్రజలను మోసం చేశారన్నారు. ..
వైసీపీ ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం.. చేస్తున్నవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యతతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, చంద్రబాబు పై నమ్మకంతోనే రాష్రానికి పెట్టుబడులొస్తున్నాయని, నిజమైన విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు