Sidebar


Welcome to Vizag Express
త్యాగమూర్తి రమాబాయి జయంతి ని మరిచారా

07-02-2025 22:36:16

త్యాగమూర్తి రమాబాయి జయంతి ని మరిచారా?
పి.గన్నవరం, వైజాగ్ ఎక్స్ప్రెస్, జనవరి 7:
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి, మాతా రమాబాయి నేడు జయంతి. ఆమె 1898 ఫిబ్రవరి 7న మహారాష్ట్రలోని "ధబోల్" గ్రామంలో జన్మించారు. ఆమె, అంబేద్కర్ ఉన్నత విద్యకు ఎంతో ఆసరాగా నిలిచింది. అంబేడ్కర్ విదేశాల్లో చదువుకునేటప్పుడు చాలాకాలం పాటు ఇంటి బాధ్యతను ఆమె చూసుకున్నారు. అందుకే  థాట్స్ ఆన్ పాకిస్తాన్, తన ప్రియమైన భార్యకు అంకితం చేశారు.
రమాబాయి అమ్మ అంటే త్యాగం. రమాబాయి అమ్మ అంటే ఒకపోరాటం. చివరకు జాతి కోసం పోరాటంలో నలుగురు బిడ్డలను పోగొట్టుకున్న ఒక మహా త్యాగమూర్తి, అటువంటి రమాబాయి విగ్రహానికి పూలదండ కూడా ఈరోజు నోచుకోలేదు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా,మామిడికుదురు మండలంలో నగరానికి చేరువలో ఉన్నటువంటి రమాబాయి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలు కాకి రెట్టలకే పరిమితమయ్యాయి. జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా.. మార్చడానికి పచ్చని కోనసీమలో అగ్నిజ్వాల రగిలించిన రాజకీయ నాయకులు ఏమయ్యారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం కోనసీమలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానం ఎస్సీలకే దక్కడానికి, అంబేద్కర్ వేసిన బిక్ష, మరిచారు.సమీపంలోని రాజకీయ సమావేశాలు పెట్టుకున్నప్పటికీ చూసి చూడనట్టు కొందరు వదిలేశారా?ఎన్నికల సమయంలో లేదా ఎవరికైనా ఉన్నత పదవి వచ్చినప్పుడే మొక్కుబడిగా అంబేద్కర్ మెడలో మొక్కుబడిగా ఒక పూలమాల, ఒక దండం చెల్లిస్తారా?