విద్యార్థులకు నాంది ఫౌండేషన్ క్రీడా సామాగ్రి అందజేత
07-02-2025 22:37:23
విద్యార్థులకు నాంది ఫౌండేషన్ క్రీడా సామాగ్రి అందజేత
భీమిలి రూరల్, వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 7:
భీమిలి జీవీఎంసీ 2వ వార్డు సంతపేట పరిధిలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ హైస్కూల్ లో చదువుతున్న 102 మంది విద్యార్థినీలకు నాంది ఫౌండేషన్ వారు క్రీడ సామాగ్రి కిట్టును తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు సమక్షంలో శుక్రవారం పంపిణీ చేశారు.ఇందులో కోటు,నోటు పుస్తకాలు పెన్సిల్లు,పెన్ను, స్పోర్ట్స్ షూస్,బ్యాగు ఉన్నాయని నిర్వాహకులు ఎస్.ఎ.గంట. దేవి,ప్రోగ్రాం అధికారిణి కె.సత్యవతి తెలిపారు.ప్రతిరోజు విద్యార్థినిలకు క్రీడలపై అవగాహన కల్పిస్తున్నామని వారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు స్వామి, ఎస్ఎంసీ చైర్మన్ ఈ వరలక్ష్మి, వైస్ చైర్మన్ రూప,స్కూల్ ఇన్చార్జ్ జగదీష్,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు