Sidebar


Welcome to Vizag Express
రాజస్థాన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో మెరిసిన విశాఖ వావ్ అథ్లెట్స్

07-02-2025 22:44:10

రాజస్థాన్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో మెరిసిన విశాఖ వావ్ అథ్లెట్స్

*అభినందించిన వావ్              చీఫ్ పేటర్న్ కమల్ బైద్,         చీఫ్ అడ్వైజర్ సత్యదేవ్

మురళీనగర్, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి, 7:

విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; రాజస్థాన్, ఆళ్వార్ లోగల రాజ్ రిషీ కాలేజ్ గ్రౌండ్ లో 
"44 వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2025"  క్రీడా పోటీలను "20వ యువరాణి నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్" పేరిట ఈ నెల 6,7,8 వ తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ స్థాయి క్రీడ పోటీలలో  "ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసిషమన్" సెక్రటరీ జనరల్ డా.మంగ వరప్రసాద్  నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ తరపున 102 మంది పాల్గొనగా *"వెటరన్ అథ్లెటిక్స్అసోసిషన్, విశాఖపట్నం"నుండీ 33 మంది పాల్గొనడం విశేషం. పురుషుల విభాగం నుండీ పాల్గొన్న విశాఖ వావ్ జాతీయ అథ్లెట్స్
ఎమ్.రామారావు,వై.గంగాధర్,
సీహెచ్.వేణు, కె.బి.వి.ఎమ్.కృష్ణ ప్రసాద్ , బి.గణేష్, కె.విశ్వనాధ్,కె. ప్రసాద్ యు.అప్పన్న దొర  అలాగే మహిళా విభాగంలో జలఉష, ఎ ఎన్ వి. రామలక్ష్మి,, కె.మత్స్య కొండ, పూర్ణిమ, దువ్వూరి సరోజ తదితరులు వివిధ క్రీడా క్రీడాపోటీలలో పోటీపడి  5 స్వర్ణ , 7రజత, 10 కాంశ్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. ఈ సందర్బంగా వావ్ అసోసియేషన్  న్యూ చీఫ్ పేటర్న్ కమల్ బైద్, న్యూ చీఫ్ అడ్వైజర్ చింతలపాటి సత్యదేవ్ , కో-ఆర్డినేటర్ సీ హెచ్. శ్రీనివాసరాజు, పీఆర్ఓ వంశీ చింతలపాటి , కార్యదర్శి ఎల్ వీ. సుధాకర్, కోశాధికారి ఎమ్. రామారావు తదితరులు  జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ విజేతలకు తమ అభినందనలను తెలిపారు.