Sidebar


Welcome to Vizag Express
అక్కినేని జీవితం ఒక పాఠం

07-02-2025 22:46:26

అక్కినేని జీవితం ఒక పాఠం 
. ఎంపీ నీ కలిసిన నాగార్జున కుటుంబ సభ్యులు

ఢిల్లీ, వైజాగ్ ఎక్స్ ప్రెస్; రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ ని ఢిల్లీ పార్లమెంట్ భవనంలో ప్రముఖ సినీనటులు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అక్కినేని నాగేశ్వర రావు  శతజయంతి సందర్భంగా ఎ ఎన్ ఆర్ గురించి రాసిన హిందీ పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సి.ఎం రమేష్  మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో ధ్రువ తారలా వెలిగిన గొప్ప నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అని యావత్ ప్రపంచం గర్వపడేలాగా అగ్ర కథానాయకుడిగా విరజిల్లిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అని ఆయన జీవితం ఒక పాఠం ఒక చరిత్ర  ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ కొనియాడారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ  కొన్నాళ్ళు క్రితం మన్ కీ బాత్ లో తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అసమానమైనవి అని ఆయన వారసత్వం అందరికీ స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఉత్తరాంధ్ర మత్స్యకార యువకుడు నిజగాధ ఆధారంగా యువ కథానాయకుడు అక్కినేని నాగా చైతన్య  నటించిన తండేల్ సినిమా విడుదల సందర్భంగా గొప్ప విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయులు తదితరులు పాల్గొన్నారు.