Sidebar


Welcome to Vizag Express
విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతీ ఒక్కరికీ ఉండాలి

07-02-2025 22:48:55

విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతీ ఒక్కరికీ ఉండాలి

*జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు

శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7: విద్యతో పాటు న్యాయ విజ్ఞానం ప్రతీ ఒక్కరికీ ఉండాలని తద్వారా శాంతియుత సమాజ స్థాపన జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నాడు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాదికారసంస్థ ఆధ్వర్యంలో  ఈ నెల 9 న జరగనున్న ప్రపంచ వెట్టిచాకిరీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని  శ్రీకాకుళం నగజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడురంలో ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద గల తిరుమల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాయుడు మాట్లాడుతూ ఆర్టికల్ 21 గురించి విపులంగా వివరించారు. రాజ్యాంగం పిల్లలకు అనేక హక్కులు కల్పించిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంగించకూడదన్నారు. స్వేచ్ఛ .సమానత్వం  రాజ్యాంగం కల్పించిన హక్కులని. వీటిని ఉల్లగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదువుకోవలిసిన వయస్సులో ఉన్న విద్యార్థులు ఎక్కడైనా వెట్టి చాకిరి చేస్తూ కనిపిస్తే జిల్లా న్యాయ సేవాధికారసంస్థ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం చేసే పనిలో ఖచ్చితత్వం ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులు, దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందన్నారు. సామాజిక బాధ్యతగా  ప్రతీ ఒక్కరూ న్యాయ నిపుణులు సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. గురువులు చెప్పిన  విషయాలు  శ్రద్ధగా విని  తిరిగి చదవడం చాలా ముఖ్యం అన్నారు. ఏ రోజు చెప్పినది ఆ రోజు చదవడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఫైనల్ ఎగ్జామ్ సులభంగా రాయవచ్చు... అని న్యాయమూర్తి  సన్యాసి నాయుడు సూచించారు.. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాసంస్థ సభ్యులు గేదెల ఇందిరా ప్రసాద్. కళాశాల ప్రిన్సిపాల్ విటి నాయుడు,.. ఎంవీజీ శంకర్, కళాశాల సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.