Sidebar


Welcome to Vizag Express
శ్రీ వెంకట సూర్య దుర్గా స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం

07-02-2025 22:50:16

శ్రీ వెంకట సూర్య దుర్గా స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం 
 హుటా హుటిన  ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7:
 పార్వతీపురం మండలం జిల్లాలోని శ్రీ వెంకట సూర్య దుర్గా స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం 
సంభవించడంతో సమాచారము తెలుసుకున్న పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో సమీక్షించారు జనవాసాలకు దగ్గరగా ఉండడంతో మంటలను అదుపు తెచ్చేందుకు పాలకొండ బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాల నుండి అగ్నిమాపక వాహనాలను తెప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి రెండు ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాగ్రత్త ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపారు. రానున్న వేసవికాలం ఉద్దేశించి ఇలాంటి వ్యాపార రంగాల్లో సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా సామర్థ్యానికి తగ్గ సిబ్బంది కానీ అగ్నిమాపక వాహనాలు కానీ సమకూర్చలేదని స్పష్టం చేశారు. సంబంధిత రాష్ట్ర అధికారుల దృష్టిలో పెట్టి సిబ్బందిని అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లుఎమ్మెల్యేవిజయ్ చంద్ర మీడియాకు తెలిపారు.