రహదారి భద్రత పై చర్యలు చేపట్టాలి
పార్వతీపురం ఆర్ టి సి డిపో మేనేజర్ ఈ. ఎస్. కె.దుర్గ
పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 7 :
రహదారి భద్రత పై చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఆర్ టి సి డిపో మేనేజర్ ఈ.ఎస్. కె. దుర్గ పిలుపునిచ్చారు.రహదారి భద్రతా మాసోత్సవాలు, బాగంగా శుక్రవారం జిల్లా రవాణా శాఖాధికారి టి.దుర్గా ప్రసాద రెడ్డి ఆదేశాల ప్రకారం యన్.రమేష్ కుమార్, ఏ.వర ప్రసాద్, సహాయ ఇంధన శకట తనిఖీ దారులు (ఏ యం వి ఎల్ ఎస్ ), డా .పి నారాయణ రావు, మెడికల్ ఆఫీసర్ పార్వతీపురం ఆర్ టి సి డిపో మేనేజర్ ఈ ఎస్ కె దుర్గ యితర రవాణా శాఖ, ఏ పి ఎస్ ఆర్ టి సి డిపో సిబ్బంది తో పార్వతీపురం ఆర్ టి సి డిపో లో రహదారి ప్రమాదాలపై ఆర్ టి సి డ్రైవర్స్, కండక్టర్స్, సిబ్బందికి, వర్కర్స్,పాదచా రులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ రోడ్డు భద్రత ఆఫెన్సెస్ల వలన జరిగే రహదారి ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. 1)మాట్లాడుతూ వాహనాలు పై అధిక లోడ్,మద్యం సేవించి వాహనంను నడపరాదని2) సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనమును నడపరాదని సూచించడం జరిగింది.3)గుడ్ సమరటిన్ & గోల్డెన్ హావర్ గురుంచి అవగాహన కల్పించుట జరిగింది.4)రోడ్ మలుపుల లో డ్రైవ్ చేసేటప్పుడు తీసుకొవలసిన్ జాగ్రత్తలు గూర్చి తెలియ చేయడమైనది. ప్రతి 6 మాసాలకు ఒక సారి కంటి మరియు ఆరోగ్య పరీక్షలు చేసుకోవలసినదిగా ఆర్ టిసిడ్రైవర్స్కుతెలియచేయదమైన ది.ఎవరైనా అనుమానితులు మాదకద్రవ్యాలను బస్సులలో రవాణా చేసినచో వారిని గుర్తించి సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలియ పరచవలనని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్. రమేష్ కుమార్, యం వి ఇన్స్పెక్టర్,ఏ వరప్రసాద్ అసిస్టెంట్ యం వి ఇన్స్పెక్టర్ డా! పి. నారాయణరావు రోడ్డు సేఫ్టీ వైద్యాధికారి,రవాణా శాఖకు సంబంధిన కానిస్టేబుల్, హోం గార్డ్స్ ఏ పి ఎస్ ఆర్ టి సి డిపో సిబ్బంది పాల్గొన్నారు.