Sidebar


Welcome to Vizag Express
ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల హాల్ టిక్కెట్లు సిద్ధం

07-02-2025 22:52:26

ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల హాల్ టిక్కెట్లు సిద్ధం



పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 7 :
 జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రయోగ పరీక్షల హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థినీ, విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్లో ఆధార్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్ ను  డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా 9552300009 వాట్సప్ నంబర్ కు ఎడ్యుకేషన్ సర్వీస్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి అందులో గత హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మార్చి 2025 హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఆమె  పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రయోగ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ప్రయోగ పరీక్ష సమయంలో  విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని  ఆ ప్రకటనలో సూచించారు.