వైయస్సార్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షులును నియమించిన పార్టీ అధిష్టానం
మాజీ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన మండల, పట్టణ అధ్యక్షులు
పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 7:
పార్వతీపురం మండలం, పట్టణ అధ్యక్షులు ను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సూచనల మేరకు పార్వతీపురం రూరల్, సీతానగరం, బలిజిపేట మండలాలు పార్వతీపురం పట్టణానికి పార్టీ అధ్యక్షులను నియామకం చేస్తూ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన నిన్న విడుదల చేసిన విశయం తెలిసినదే. ఈ శుభ సందర్భంగా పార్వతీపురం పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్వతీపురం మండలం పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, సీతానగరం మండలం పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టి రాజు బలిజిపేట మండలం పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణలు నేడు మాజీ ఎమ్మెల్యే జోగారావు ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని తమకి పార్టీకి సేవచేసుకునే గొప్ప అవకాశం మళ్ళీ కల్పించిన అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి మాజీ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలుపుతూన్నమని తెలిపారు.పుణః నియామకం కాబడిన వారందరికీ పేరుపేరునా స్థానిక మాజీ ఎమ్మెల్యే జోగారావు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికే భవిష్యత్లో మంచి గౌరవం లభిస్తుంది అని అలానే ఆయా మండలాలు పట్టణంలో పార్టీ మరింత బలోపేతం చేసేందుకు మీరందరూ శక్తివంతం లేని కృషి చేస్తూ మళ్ళీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి తీరే వరకు ప్రజా క్షేత్రంలో విశ్రమించని పోరాటం చేయడానికి అందరూ సంయుక్తమై పార్టీ కేడర్ను కలుపుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి బలగ నాగేశ్వరరావు, ఎంపీపీ ప్రతినిధి మజ్జి శేఖర్, వైస్ ఎంపీపీలు సిద్ధ జగన్నాధరావు, బంకురి రవి, మాజీ ఆత్మ చైర్మన్ యాంద్రాపు తిరుపతిరావు, ఎంపీటీసీ బడే రామారావు, నాయకులు వాసుదేవరావు, వెంకట్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.