ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ తృటిలో తప్పిన భారీ పెను ప్రమాదం
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 7:
కొమరాడ పోలీస్ స్టేషన్కు అతిసమీపంలో ఉన్న రహదారి మలుపు వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్నప్పటికి పెను ప్రమాదం తప్పింది.
ఒక వ్యక్తికి చిన్న గాయాలు తప్ప మిగతా వాళ్ళందరూ క్షేమంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. స్థానిక ఎస్ఐ తన సిబ్బంది తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని వెంటనే కొమరాడ ప్రాథమిక హాస్పిటల్లో చేర్పించారు.
కొమరాడ పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో అంతరాష్ట్ర రహదారి మార్గాన భారీగా మలుపు ఉండటంతో ఈ మలుపు వద్ద అనేక ప్రమాదాలు జరిగి ప్రయాణికులు చనిపోయిన పరిస్థితి ఉందని ఇలాంటి శుక్రవారం పార్వతిపురం నుండి అటు ఒరిస్సా వెళ్తున్న లారీ నెంబర్ OD 16 k 7 665 గల లారీ అటు కూనేరు నుండి పార్వతీపురం వస్తున్న AP35y3897 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఈ రెండు వాహనాలు ఈ మలుపు వద్ద ఢీకొట్టడంతో భారీ ప్రమాదం తప్పిందని అయితే ఇలాంటి సందర్భంలో కూనేరు గ్రామానికి చెందిన వై.సుమంత్ అనే వ్యక్తికి చిన్న గాయాలు తప్ప ఎవరికి ఏ ప్రమాదం జరగని పరిస్థితిలో అందరూ క్షేమంగా ఉండే పరిస్థితి ఉందని ఒకవేళ ఈ ప్రమాదం జరిగి ఉంటే సుమారు ఈ ఆర్ టి సి బస్సులో ఉన్న 20 మంది వరకు ప్రాణాలు విడిచే ప్రమాదం ఉండేదని కాబట్టి ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఇ ప్పటికైనా ఈ మలుపు వద్ద భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ప్రమాద హెచ్చరికలతో పాటు స్పీడ్ బ్రేకర్లు, నిర్మించి అటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి రోడ్ల భవనాల శాఖ అధికారులు కోరారు.