Sidebar


Welcome to Vizag Express
పేకాట శిబిరం పై దాడి

09-02-2025 03:02:52

పేకాట శిబిరం పై దాడి 
పార్వతీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
పార్వతీపురం మన్యం జిల్లా, బలిజిపేట మండలం, పెదపెంకి గ్రామ శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని  ముందస్తు సమాచారం మేరకు శనివారం సాయంత్రం బలిజిపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సింహాచలం, వారి సిబ్బందితో కలిసి పెదపెంకీ గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నవారి  వారిపై  దాడి నిర్వహించి 08 మంది పేకాటరాయుడులను పట్టుకొని వారి వద్ద నుండి  53,080/- రూ. నగదును స్వాధీన పరుచుకొని వారిపై కేసు నమోదు చేశారు.