Sidebar


Welcome to Vizag Express
రాష్ట్ర మన్యం బంద్ జయప్రదం చేయాలి

09-02-2025 03:06:30

రాష్ట్ర మన్యం బంద్ జయప్రదం చేయాలి

ఆదివాసి గిరిజన సంఘం 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి,08: రాష్ట్ర మన్యం బంద్ జయప్రదం చేయాలని మండల కేంద్రంలో  శనివారం జరిగిన వారపు సంతలో ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి కొర్ర నర్సయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈనెల 11,12 తేదీల్లో జరిగే రాష్ట్ర మన్యం బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజనులను కోరారు. ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయం నుండి భారీ ర్యాలీగా వచ్చి నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం ఏర్పడి ఈనెల 11,12వ తేదీల్లో జరిగే రాష్ట్ర మన్యం బంద్ ను విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ బద్ధంగా పదవిలో ఉన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల  1/70 చట్టం సవరణ చేయాలని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని ఆదివాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసి గిరిజన ప్రాంతంలో టూరిజం పర్యాటకం అభివృద్ధి కోసం హోటల్లు రెస్టారెంట్లు పార్కులు వ్యవస్థగా మార్చి 1/70 చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యాఖ్యలు సరికాదని వారు హెచ్చరించారు. ఆదివాసులకు తీవ్ర ద్రోహం చేయటమే భాగంగా షెడ్యూల్ ఏరియాలో టూరిజం అభివృద్ధి చట్టం సవరణ చేయాలని అయ్యన్నపాత్రుడు చేసిన వాక్యాలు వ్యక్తిగతంగా లేక కూటమి ప్రభుత్వ విధానము స్వస్థత చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఉద్యోగులు కార్మికులు ప్రజా సంఘాలు, మహిళ సంఘాలు ప్రజలు యువతి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 48 గంటల రాష్ట్ర మన్యం బందును విజయవంతం వారపు సంతలు ప్రజలకు గిరిజన సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పి సత్యనారాయణ, ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు, ఎంఎం శ్రీను,మండల గిరిజన సంఘం నాయకులు, ఎస్ గాసిరం దొర, జి నారాయణ, వీ లైకోన్, జీనబంధు, నారాయణ, నర్సింగ్ పడాల్, కామేష్, గిరిజన మహిళా సంఘ మండల అధ్యక్ష కార్యదర్శులు, ఈశ్వరి, విజయ లతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.