Sidebar


Welcome to Vizag Express
శ్రీ షిరిడిసాయి బాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ

09-02-2025 03:08:06

చీపురుపల్లి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 8: మూడు రోజులు కార్యక్రమములో భాగoగా  ఈ రోజు చీపురుపల్లి పట్టణంలో మెట్ట కాలనీ లో శ్రీ షిరిడిసాయి బాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ జరిగింది. తొలితోజు భక్తులు ఊరేగింపు కార్యక్రమ లో పాల్గొన్నారు. రెండవరోజు సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించారు. మూడవ రోజు వేదపండితులు విగ్రహం ప్రతిష్టకు ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహం ప్రతిష్ట నిర్వహించారు. ప్రతిష్ట అనంతరము అన్నదాన కార్యక్రమము జరిగినది . వందలాది భక్తులు ప్రసాదాన్ని  సేవించారు. విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని బాబాని దర్శించుకొని పూజలు చేసిన చీపురుపల్లి ఎంపీపీ ఇప్పిలి అనంతం,జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజి  జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, మాజి పి.ఎ.సి.ఎస్.  ప్రెసిడెంట్ బెల్లాన త్రినాధ్ వారితో పాటుచీపురుపల్లి పట్టణ ప్రజాప్రతినిధులు, గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, పాండ్రంకి వాసుదేవరావు, మండల ఆదినారాయణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు అనంతరం వేద పండితులు  నాయకులు కు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు.