రేగిడి ఫిబ్రవరి 8 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రేగిడి ఆమదాలవలస మండలం తాటిపాడు గ్రామం లో శనివారం భీష్మ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి గ్రామానికి చెందిన గాధం కుటుంబీకులు మరియు గ్రామస్తులు ఆరాధ్య దేవత గా కొలిచే మరియు కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లి అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ బాల అన్నమ్మ పేరంటాలు తల్లి కి అత్యంత భక్తి శ్రద్ధలతో
స్త్రీలు పసుపు కుంకుమ మంగళసూత్రాలు నుతన చీరలు మంగళ వాయిద్యాలు తో వెళ్లి అన్నమ్మ తల్లి కి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామానికి చెందిన గాదం వంశీకులు మరియు ఆలయ ధర్మకర్త గాదం గోవిందరావు ఆద్వర్యం లో అమ్మ వారికి బోనాలు సమర్పించారు...ఈ కార్యక్రమంలో గాదం నారాయణరావు గాదం రామ్మూర్తి గాదం సింహాచలం స్థానిక సర్పంచ్ ప్రతినిధి పేడ్డ బాబూరావు నాయుడు మాజీ సొసైటీ డైరెక్టర్ రామినాయుడు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.