బిజెపి గెలుపుపై హర్షం
రాజాం. వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 8
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంపై ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్తిరెడ్డి మధుసూదనరావు హర్షం ప్రకటించారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ
ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీకి మద్దతు తెలిపిన ఢిల్లీ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా నాయకత్వానికి నిదర్శనం అన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ఉండగా సింహభాగంలో భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, మరికొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోదీ 3.0 ఈ సంఖ్య త్వరలో పెరగబోతుందన్నారు.