ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు.
రేగిడి ఫిబ్రవరి 8 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రేగిడి ఆమదాలవలస మండలం ఒప్పంగి గ్రామంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రజలు ఏకువ జామున లేసి తల స్థానాలు చేసి సాంప్రదాయ వస్త్రాలు ధరించి గ్రామములో ఉన్న రామాలయంలో వెలిసి
శ్రీ రాముడు, సీతమ్మ , లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కు భక్తిశ్రద్ధలతో ప్రత్యేకమైన కుంకుమ పూజలు నిర్వహించి, ప్రతి ఇంటింటా రకరకాల వంటకాలు వంట చేసుకొని చుట్టుపక్క గ్రామాల చుట్టాలు మరియు బంధువులు పిలిచి వారికి భోజనం ఏర్పాటు చేసి పెద్ద పండగల జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు పూర్వం నుండి గ్రామంలో ప్రతి సంవత్సరం పెద్ద పండగల జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు సంస్కృతి కార్యక్రమాలు,ముగ్గుల పోటీలు, వివిధ రకాల ఫోటోలు నిర్వహించారు. అనంతరం సాయంత్రకాలo సమయములో శ్రీ రాముడు, సీతమ్మ , లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అలంకరణ చేసి సవారి లో భజన సంకీర్తనల తో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.