నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అక్రమ నిర్మాణాలు.... ముడుపుల మత్తులో టౌన్ ప్లానింగ్.
ఏసీబీ దాడులు జరిగినా తీరుమారని మధురవాడ జోన్ టు
మధురవాడ,వైజాగ్
ఎక్స్ప్రెస్ :
జీవీఎంసీ మధురవాడజోన్ టూలో అక్రమ
నిర్మాణాల జోరు గా సాగుతున్నాయి. నిబంధనలకు తూట్లు
పొడుస్తూ అడ్డగోలు నిర్మాణాలు చేస్తుంటే అడిగే నాధుడు కరువ
య్యాడు.అధికారులు నిర్మాణదారులతో లాలూచీ పడటంతో
ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు ఏడా పెడా పెరిగిపోతున్నాయి.
సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లిన పట్టించుకోవడం లేదన్న ఆరోపణ సర్వత్రా వినిపిస్తున్నాయి. లంచాలకు కక్కుర్తి పడి అడ్డగోలు నిర్మాణాలకు పూర్తి
సహాయ సహకారాలు అందజేస్తున్నారు. జీవీఎంసీ జోన్ టూ టౌన్
ప్లానింగ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎలాంటి
అనుమతులు లేకుండా నిర్మించేవి కొన్ని బవంతలులైతే, రెసిడెన్షి
యల్ ప్లాన్ అని చెప్పి కమర్షియల్ బిల్డింగ్ లు కట్టే వారితో పాటు
తప్పుడు ప్లాన్ లతో ఇల్లు నిర్మించే వాళ్ళు ఇక్కడ
ఎక్కువగా వున్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్..
అధికారులు ముడుపులు మత్తులో జీవీఎంసీ
నియమ నిబంధనలకు పాతర వేస్తూ అక్రమ
భవన నిర్మాణ దారులకు తమదైన శైలిలో
అండదండలు అందిస్తున్నారు. అసిస్టెంట్
సిటీ
ప్లానర్, వార్డు ప్లానింగ్ సెక్రెటరీలు జీవీఎంసీ
ఆదాయానికి స్వయంగా గండి కొడుతున్నారు.
ఇటీవలే కాలం లో వచ్చిన అధికారి రాష్ట్ర మంత్రి పేరు
చెప్పి జోన్ టూ లో హవా కొనసాగిస్తున్నారు. ఎవరిని లెక్క
చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దండిగా జేబులు
నింపుకుంటున్నారు. బయటకు అడుగుపెడితే జేబులు
నిండేందుకు వెనక్కి తిరిగి వెళ్లే వ్యక్తులు కాదని వీరి పై పలువురు
ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీరి అవినీతి అక్రమాలకు జోన్ టూ
అడ్డాగా మారింది. నివాస ప్లాన్లు మంజూరు చేసి కమర్షియల్ గా
కడుతున్న ఆక్రమ నిర్మాణ భవన యజ మానుల దగ్గర నుండి
సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ వీరికి రింగ్ మాస్టర్లుగా
వ్యవహరించి ఆక్రమ నిర్మాణ దారుల నుంచి లక్షల్లో లంచాలు
మింగేస్తున్నారు. వీరి అవినీతి పై ఏసీబీ దృష్టి పెట్టకపోవడం తో
బరితెగేస్తూ కాసుల వేటలో ఇప్పుడు పడ్డారు.
మిథిలాపూరి వుడా కాలనీ రోడ్డులో అనధికార హోటల్ నిర్మాణం..! అడ్డుగోలుగా అనేక నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. సచివాలయ కార్యదర్శులు మధ్యవర్తులుగా వ్యవహరించి అమ్యమాలు రాబట్టుతున్నారు.
మధురవాడ మిథిల పూరి వుడా కాలనీ రహదారి అనుకోని
అనధికార హోటల్ నిర్మాణం కు అధికా రులు ప్రోత్సహించారు.
ఎటువంటి అనుమతులు లేకుండా ఇష్టంసారం గా అక్రమ
నిర్మాణం కళ్ళ ముందు కడుతున్న చోద్యం చూస్తున్నారు.
-
నియమ నిబంధనలు ఉల్లంఘన.....
సెట్ బ్యాక్లు గాలి వెలుతురు సదుపాయాలు, అగ్నిమాపక
నిరోధక ఏర్పాట్లు లేకుండానే జోన్ టూ ప్రాంతంలో అనేక భారీ
భవంతులు కట్టడానికి అక్రమంగా పర్మిషన్లు ఇస్తున్నారు. కొన్ని
భవన నిర్మాణాల దరఖాస్తులను తిరస్కరించినప్పటికి అక్రమంగానే
భారీ భవంతులు నిర్మించేస్తున్నారు. ఇవన్నీ ఉన్నతాధికా రులు
దృష్టికి రాకుండా మేనేజ్ చేస్తున్నారు. నగరంలో
జరిగిన ఇటువంటి
అక్రమ భవన కట్టడాల పై గతంలో అనేకసార్లు ఏసీబీ, విజిలెన్స్
శాఖ తనిఖీలు చేసి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. ఇదే క్రమంలో
అవి నీతి నిరోధక శాఖ అధికారులు జీవీఎంసీ టౌన్
ప్లానింగ్ అధికారులను లంచాలు దిగమింగడంతో
అరెస్టులు కూడా చేసారు. అయినప్పటికీ జోన్ టూ
టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పనితీరు
మారడం లేదు. మళ్ళీ యధావిధిగా లక్షలాది
రూపాయలు లంచాలు దిగమింగుతూ భారీ
భవంతుల అక్రమ కట్టడాలకు అనధికారికంగా
అనుమతులు ఇస్తున్నారు. దింతో ఎక్కడ చూసినా
అక్రమ భవన కట్టడాలు పుట్టగొడుగుల్లా
వెలుస్తున్నాయి. దీనికి ఉదాహరణగా హాస్పిటల్ పేరుతో
కమర్షియల్ కట్టి అద్దెలకు ఇవ్వడం అలాగే మిథిలాపూరి వుడా
కాలనీ, పిఎంపాలెం రహదారికి అనుకోని నియమ mనిబంధనలను
పాటించకుండా ఒక పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.
జోన్ టూ అధికారులు, సిబ్బంది లంచాలు తీసుకొని చూసి
చూడనట్లుగా ఉంటూ ఎటువంటి చర్యలు తీసుకోవడం
లేదు. అక్రమ భవన కట్టడాలను ప్రోత్సాహిస్తు న్నారు. ఇప్పటికైనా
ఈ అవినీతి అక్రమ వ్యవహారాల పై మరోసారి విజిలెన్స్, అవినీతి
నిరోధక శాఖ అధికా రులు దృష్టి సారించి అక్రమార్కుల పై
చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యేక
చీఫ్ సిటీ ప్లానెర్, అసిస్టెంట్ సిటీ ప్లానెర్ చోద్యం.
మధురవాడ జీవీఎంసీ జోన్ టూ పరిధిలో టౌన్ ప్లానింగ్ శాఖ
ఉందొ లేదో తెలియడం లేదని ఇప్పుడు స్థానికంగా చర్చ
మొదలైంది. అనధికార నిర్మాణాలు ఇష్టం వచ్చినట్లు కడుతూన్న
టౌన్ ప్లానింగ్ ఏసిపి అక్రమ నిర్మాణాల తొలిగించకుండా చోద్యం
చూస్తున్నారు. అదే బాటలో చీఫ్ సిటీ ప్లానెర్ కూడా పట్టించు కునే
దాఖలాలు అయితే లేవు. రాష్ట్ర మంత్రి మా చుట్టం అంటూ
బహిరంగంగా చెప్పుకుంటూ విధి నిర్వ హణలో అలసత్వం
వహిస్తున్నారని స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశంగా
మారింది. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై అవినీతి నిరోధక శాఖ
దృష్టి సరిస్తే నివ్వురుగుప్పె నిజాలు వెలుగు చూస్తున్నాయని
అంటున్నారు.