Sidebar


Welcome to Vizag Express
గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలపై వినతి

09-02-2025 03:14:48

గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలపై వినతి 
 గాజువాక- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 9 
అదానీ గంగవరం పోర్టు నిర్వాసితులు కార్మికులు సమస్యలు పైన పూర్తి మద్దతు తెలియజేసిన గాజువాక వైసీపీ ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి  మరియు గాజువాక సిపిఎం పార్టీ 78వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ ఫోర్ లీడర్ బి గంగా రామ్ అదానీ గంగవరం పోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు గాజువాక వైసీపీ ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి   ని మరియు గాజువాక సిపిఎం పార్టీ 78వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ ఫోర్ లీడర్ బి గంగా రామ్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. గాజువాక వైసీపీ ఇన్చార్జి తిప్పల దేవన్  మరియు గాజువాక సిపిఎం పార్టీ 78వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ ఫోర్ లీడర్ బి గంగా రామ్  మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నిర్వాసితులకు కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మీ సమస్యలు పరిష్కారమైనంతవరకు మీ ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని అలాగే మీ యొక్క సమస్యలుమా యొక్క పై స్థాయి నాయకులతో మీ యొక్క సమస్యల పైన మాట్లాడి మీ యొక్క ఉద్యమానికి మీ యొక్క సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేస్తూ నిర్వాసితు ఉద్యోగులు తీసుకునే కార్యక్రమానికి మా యొక్క గాజువాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు గాజువాక సిపిఎం పార్టీ తరఫున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదానీ గంగవరం పోర్టు నిర్వాసితు ఉద్యోగుల సంఘం నాయకులు గంటిపిల్లి అమ్మోరు(సలీమ్..నొల్లి తాతారావు.కదిరి సత్యానందం.వాసుపల్లి ఎల్లాజీ.కదిరి సత్యరావు,నొల్లి స్వామి,కదిరి తాతారావు.నొల్లి సోమేష్,చుట్టూరు అప్పలరాజు,గంటిపిల్లి అప్పలస్వామి,గంగవరం పోర్టు నిర్వాసితుల ఐక్య సంఘం నాయకులు కంబాల మల్లేశ్వరరావు మరియు కార్మికులు పాల్గొన్నారు