భీష్మ ఏకాదశి సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణ అన్న ప్రసాదం వితరణ
09-02-2025 03:15:58
భీష్మ ఏకాదశి సందర్భంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణ అన్న ప్రసాదం వితరణ
గాజువాక - వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 9, జీవీఎంసీ 65 వార్డు వాంబే శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ పార్థసారధి చేతుల మీదుగా అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ముఖ్య అతిధులు మాట్లాడుతూ గాజువాకలో ఉత్తర ద్వారంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది అన్నారు. కోరుకున్న కోర్కెలు తీర్చే వెంకటేశ్వర స్వామినీ భీష్మ ఏకాదశి రోజు దర్శించుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. స్వామివారి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల స్వాతి, గొరుసు రామలక్ష్మి, కె.జానకి, పండూరి సత్యవతి, బొబ్బిలి స్వాతి, ఎ. శారదమ్మ, పద్మ, ఆర్. లత, భవాని, అరుణ, చిట్టమ్మ, గౌరీ, రమ, హిమజ, మంగమ్మ, వరలక్ష్మి, శరగడం సావిత్రమ్మ, లక్ష్మమ్మ, నాగమణి, కుమారి, దశరథ్ సింగ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు