Sidebar


Welcome to Vizag Express
74 వ వార్డు సిద్దేశ్వరం రామాలయం లో భీష్మ ఏకాదశి పూజలు

09-02-2025 03:17:08

74 వ వార్డు సిద్దేశ్వరం రామాలయం లో భీష్మ ఏకాదశి పూజలు
 పెదగంట్యాడ- వైజాగ్ ఎక్స్ప్రెస్, ఫిబ్రవరి 9 
74 వ వార్డు సిద్దేశ్వరం గ్రామంలో వెలసియున్న రామాలయం గుడిలో భీష్మ ఏకాదశి పూజలు జరిగాయి దీనికి ముఖ్యఅతిథిగా 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశి రెడ్డి పాల్గొన్నారు ముందుగా రామాలయం గుడిలో పూజలు ప్రారంభించి వంశి రెడ్డి మాట్లాడుతూ భీష్మ ఏకాదశి పర్వదినం నా పూజలు జరిపించుకోవడం ఎంతో మంచిది ఈ సిద్దేశ్వరం గ్రామంలో ఉన్న రామాలయం గుడిలో ప్రతి సంవత్సరము అది ఘనంగా పూజులు జరిపించడం నన్ను ముందుగా పిలిచి నాతోటే ఈ పూజలు ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే భీష్మ ఏకాదశి అనగా శ్రీమన్నారాయణ ప్రత్యేకమైన పూజలు రాములవారు మరియు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఈ గ్రామ కమిటీ పైన ఈ సిద్దేశ్వరం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.


 కార్యక్రమంలో సిద్దేశ్వరం రామాలయం కమిటీ మరియు గ్రామ పెద్దలు మహిళలు యువకులు భక్తులు పాల్గొన్నారు