Sidebar


Welcome to Vizag Express
పీఎం పాలెం శిరిడి సాయి ఆలయంలో అన్నాభిషేకం. భక్తులకు అన్న సమారాధన.

09-02-2025 03:18:06

పీఎం పాలెం శిరిడి సాయి ఆలయంలో అన్నాభిషేకం. భక్తులకు అన్న సమారాధన.
 మధురవాడ, వైజాగ్ ఎక్స్ప్రెస్ :
 భీష్మ ఏకాదశి సందర్భంగా పీఎం పాలెం ఆఖరి బస్టాప్ వద్ద గల శ్రీ శిరిడి పద్మ సాయి ఆలయము నందు స్వామివారికి అన్నాభిషేక శనివారం  చేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ స్వహస్తాలతో స్వామి వారికి అన్నం సమర్పించారు.100 కేజీలు అన్నాన్ని స్వామివారి విగ్రహంపై అభిషేకం చేసి అనంతరం అదే స్వామివారి ప్రసాదంగా  సుమారు వెయ్యి మందికి అన్న సమారాధన చేశారు.ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం సేకరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఈ ఎన్ ఎస్ చందర్రావు  ఉపాధ్యక్షులు నారాయణరావు సభ్యులు కే, సర్వ దేవుళ్ళు బలరా మూర్తి, రామకృష్ణ, పోతిన గిరిబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు