ముద్రగడ ఇంటిపై దాడి ని ఖండించిన చిర్ల జగ్గిరెడ్డి
09-02-2025 03:20:26
ముద్రగడ ఇంటిపై దాడి ని ఖండించిన చిర్ల జగ్గిరెడ్డి
కొత్తపేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 7:
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కు, కిర్లంపూడి ఆయన స్వగృహంలో కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం తెలిపారు. ముద్రగడ స్వగృహం వద్ద జరిగిన మీడియా సమావేశంలో చిర్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో ఉన్న దుండగులు పద్మనాభం ఇంటి మీద దాడి చేయడం హేయమైనా చర్య అన్నారు. దాడి జరిగిన తర్వాత నుంచి ఈరోజు వరకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గాని, ఈ దాడి గురించి స్పందించకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఎక్కడో ఎండిఓ మీద జరిగిన దాడికి పవన్ కళ్యాణ్ అక్కడి వరకు వెళ్లి దాడిని ఖండించారు, కనీసం ఇక్కడ దగ్గరలో ఉన్న ముద్రగడ పద్మనాభం మీద దాడి జరిగితే కనీసం స్పందించలేదని, కూటమి ప్రభుత్వంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి రక్షణ లేకపోతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ప్రశ్నించారు.