సుబ్బారాయుడుపాలెంలో వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన:
హాజరైన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
నర్సీపట్నం మున్సిపాలిటీ సుబ్బారాయుడుపాలెం గ్రామంలో శనివారం శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా,వేదపండితులచే ప్రత్యేక హోమాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆయనకు పట్టు వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తమరాన శ్రీనివాస్, మాకిరెడ్డి బుల్లిదొర, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, నర్సీపట్నం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏకాశివ తదితరులు పాల్గొన్నారు.