Sidebar


Welcome to Vizag Express
గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు రెండు కేజీల గంజాయి స్వాధీనం

09-02-2025 08:08:53

గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు  అరెస్టు రెండు కేజీల గంజాయి స్వాధీనం 

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
అక్రమంగా ఏజెన్సీ ప్రాంతం నుండి మైదానకి ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరువ్యక్తులను అదుపులోకి తీసుకొని రెండు కేజీలు స్వాధీన పరుచుకున్నామని
కృష్ణ దేవి పేట ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు దీనికి సంబంధించి ఎస్సై అందించిన వివరాలు ఇలా ముందస్తు సమాచారం రావడంతో చింతపల్లి నుండి తమిళనాడు రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా కేడీపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా రెండు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నమన్నారు వీరిది తమిళనాడు రాష్ట్రానికి తిరునాయనార్ జిల్లా కోరవంగి గ్రామానికి చెందిన అప్పు రాఘవన్, (32),   చల్లంగి శ్రావణ్ (27) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం రాచపనుకు గ్రామం వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు