ఈర్లె నూకరాజు కుటుంబానికి అండగా ఉంటాం
జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ సూర్యచంద్ర*
గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
గొలుగొండ మండలం కొత్తఎల్లవరం జనసేన ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేసిన వడపర్తి గ్రామానికి చెందిన ఈర్లె నూకరాజు(బోస్) కుటుంబాన్ని అన్ని విధాలా అండగా ఉంటామని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర అన్నారు. శనివారం ఈర్లె నూకరాజు(బోస్) పెద్ద ఖర్మ కార్యక్రమానికి సూర్యచంద్ర హాజరై నూకరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నూకరాజు కుటుంబానికి జనసేన పార్టీ తరపున తోడుగా ఉంటామని అభయమిచ్చారు. ఆ కుటుంబానికి భవిష్యత్ లో ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.