Sidebar


Welcome to Vizag Express
దారమటంలో భీష్మ ఏకాదశి ఉత్సవం

09-02-2025 08:12:41

దారమటంలో భీష్మ ఏకాదశి ఉత్సవం

గొలుగొండ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
భీష్మ ఏకాదశి సందర్భంగా దారమఠం శ్రీ ఉమా దార మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులు గ్రామ సందర్శన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దారమటంలో ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను రథం పైకి ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు.దారపాలెం, కొత్తపాలెం, గొలుగొండ జోగుంపేట జంక్షన్ కొత్త జోగంపేట జానకిరాంపురం, నరసింగపల్లి పాత మల్లంపేట, హుక్కంపేట మీదుగా ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉమా దారు మల్లేశ్వర స్వామి దివ్య ఆశీస్సుల కోసం భక్తులు ఊరేగింపులో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్  మామిడి ఆదిలక్ష్మి ఆనంద్, అడిగర్ల అప్పలనాయుడు, తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.భీష్మ ఏకాదశి సందర్భంగా దారమఠం శ్రీ ఉమా దార మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులు గ్రామ సందర్శన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. దారమటంలో ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులను రథం పైకి ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు.దారపాలెం, కొత్తపాలెం, గొలుగొండ జోగుంపేట జంక్షన్ కొత్త జోగంపేట జానకిరాంపురం, నరసింగపల్లి పాత మల్లంపేట, హుక్కంపేట మీదుగా ఊరేగింపు ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉమా దారు మల్లేశ్వర స్వామి దివ్య ఆశీస్సుల కోసం భక్తులు ఊరేగింపులో పాల్గొని స్వామివారి ఆశీస్సులు  పొందుతున్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్  మామిడి ఆదిలక్ష్మి ఆనంద్, అడిగర్ల అప్పలనాయుడు, తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.