నర్సీపట్నంలో దేదీప్యమానంగా లక్ష దీపోత్సవం:
శ్రీ షిరిడి సాయినాధుని ఆలయంలో స్పీకర్ అయ్యన్న దంపతులు ప్రత్యేక పూజలు:
నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8:
భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ షిరిడి సాయినాధుని ఆలయంలో, శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆయన సతీమణి పద్మావతి షిర్డీ సాయి నాధుని దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, వేద పండితులు వేదమంత్రాలుతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సాయినాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. గత 23 సంవత్సరాలుగా స్వామివారికి లక్ష ప్రమిదల దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు, ప్రజల సహకారంతో సాయి నాధుని ఆలయం దిన దినాభివృద్ధి చెందుతుందని అయ్యన్న తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శనివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడంతోపాటు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు
Sub caption. ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం.................
భీష్మ ఏకాదశి సందర్భంగా ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలనుండి లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతి దంపతులచే జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది మహిళలు, భక్తులు సాంప్రదాయ దుస్తులతో, అధిక సంఖ్యలో పాల్గొనడంతో, ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణంతో కనువిందు చేసింది.అలాగే లక్ష దీపాల కాంతులతో స్టేడియం దేదీప్యమానంగా వెలుగొందుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెద్దిరెడ్ల చింతల పాత్రుడు (చింటూ), వైస్ ప్రెసిడెంట్ బొంతు రమేష్, సెక్రటరీ వేగేసిన రామచంద్ర రాజు, కోశాధికారి ఈశ్వర రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.