Sidebar


Welcome to Vizag Express
ఘనంగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి 40వ వార్షికోత్సవం

09-02-2025 08:15:02

ఘనంగా శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామివారి 40వ వార్షికోత్సవం:
నర్సీపట్నం,వైజాగ్ ఎక్స్ ప్రెస్ ఫిబ్రవరి 8: 
శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వారి 40వ వార్షికోత్సవ తీర్థ మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నం, బలిఘట్టం అగ్నిమాపక కేంద్రం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి వారిని  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వారి సతీమణి చింతకాయల పద్మావతి  దర్శించుకున్నారు.
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు తోటకూర రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన 40వ వార్షికోత్సవ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా, అభయాంజనేయ స్వామి వారికి, శనివారం వేకువజాము నుండి పాలాభిషేకము, తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాదిమంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.