శ్రీ శ్రీ శ్రీ భూలోకమాంబ అమ్మవారి ఆలయ స్థిర ప్రతిష్ట మహోత్సవం
.కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 8;
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి 8వ జోన్ 98 వ వార్డు వేపగుంట పరిధిలోని అప్పన్నపాలెంలో శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారి ఆలయ స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారి ఆలయ విగ్రహ యంత్ర శిఖర స్థిర ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషమని ఆ అమ్మవారి కృప నగర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.