Sidebar


Welcome to Vizag Express
"లలిత కళా విదూషి" అవార్డు అందుకున్న చెన్నా ప్రణాళిక

09-02-2025 08:20:02

"లలిత కళా విదూషి" అవార్డు అందుకున్న చెన్నా ప్రణాళిక

విశాఖ సిటీ, వైజాగ్ ఎక్స్ ప్రెస్: నగరానికి చెందిన శ్రీ శారదాంబ నృత్య పీఠం నృత్య కళాకారిణి, ప్రముఖ నాట్యాచార్యులు పైడిరాజు గురువు శిష్యురాలు  "చెన్నా ప్రణాళికకు లలిత కళా విదూషీ" అవార్డు లభించింది. శ్రీ శ్యామలానంద నాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ రాజమాతంగీశ్వరి దేవి షోడశ నవరాత్రి మహోత్సవములులో  అద్భుతమైన కళా ప్రదర్శన చేసి అందరినీ ఆహ్లాదమైన నృత్యంతో ఆకట్టుకున్నందుకు గానూ.... శ్యామలానందనాథ  స్వామీజీ ఆశీస్సులతో చెన్నా ప్రణాళికను  విశిష్టమైన "లలిత కళా విదూషి" అనే అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఇదివరలో చెన్నా ప్రణాళిక సుమారు 300 పైగా నృత్య ప్రదర్శనలు చేసారు. నృత్యం ద్వారా వచ్చిన డబ్బుతో, తన తండ్రి ఇచ్చే పోకేట్ మనీతో పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్య, సేవా, నృత్య, చిత్రలేఖనం, స్పీచ్, వ్యాసరచన, స్పోర్ట్స్ తదితర రంగాల్లో ఎన్నో బహుమతులను, అవార్డ్స్ ను అందుకున్నారు ప్రణాళిక. ఈ సందర్భంగా చెన్నా ప్రణాళిక మాట్లాడుతూ... తనకు శాస్త్రీయ నృత్యంలో మెలుకువలు నేర్పి అవార్డ్ అందుకునే స్థాయికి తీసుకువచ్చిన గురువు, నాట్యాచారులు పైడిరాజుకు, అవార్డ్ అందించిన శ్రీ శ్యామలానంద నాథ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు నృత్య అకాడమీల గురువులు, నృత్య కళాకారులు తదితరులు పాల్గొని చెన్నా ప్రణాళికను అభినందించారు.